ప్రశాంతంగా టిఎస్ పి ఎస్ సి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష
మొత్తం అభ్యర్థులు 16824 , పరీక్షకు హాజరైన వారు13345 – గైర్హాజరు అయినవారు 3479
— 79.30 శాతం హాజరు
— జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
తిమ్మాపూర్, అక్టోబర్ 16 (జనం సాక్షి): జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. ఆదివారం జిల్లాలో జరిగిన గ్రూప్-1 ప్రిలీమినరి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ పరిశీలించారు. కిమ్స్, జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలు మరియు ప్రభుత్వ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్షా కేంద్రాలలో బయోమెట్రిక్ విధానం, పరీక్ష నిర్వహణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. కిమ్స్ కళాశాలలో కోడింగ్ ను పరిశీలించి పేపర్ బాక్సులను జిల్లా కలెక్టర్ స్వయంగా తెరిచారు. హాజరు వివరాలను తెలుసుకున్నారు. జ్యోతిష్మతి కళాశాలలో పరీక్షా కేంద్రాలను పరిశీలించి అభ్యర్థి సహాయకురాలి ద్వారా పరీక్షను రాస్తున్న విధానాన్ని పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందన్నారు. జిల్లాలో ఏర్పాటుచేసిన 35 పరీక్షా కేంద్రాలలో మొత్తం 16824 అభ్యర్థులకు గాను13345 విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా3479 మంది ఆబ్సెంట్ అయ్యారని 79.30 శాతం హాజరు నమోదు అయినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యకమంలో అదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్, అడిషనల్ సిపి చంద్రశేఖర్, కలెక్టరేట్ ఏవో డాక్టర్ కె నారాయణ, టీఎస్పీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ ఆసియా ఖాన్ , అమర్జిత్ కౌర్ జూనియర్ అసిస్టెంట్, తదితరులు పాల్గోన్నారు.