ప్రశాంతంగా న్యూ ఇయర్‌ వేడుకలు

అపశృతులకు తావులేకుండా చూసుకోవాలి
గైడ్‌లైన్స్‌ విడుదల చేసిన నగర పోలీస్‌ శాఖ
హైదరాబాద్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): కొత్త సంవత్సరాన్ని ఆహ్వినించేందుకు జరుపుకునే వేడుకల్లో ఎలాంటి అపశృతులు లేకుండా,  ప్రజలంతా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సూచించారు. కొత్త సంవత్సర వేడుకలపై పోలీసులు గైడ్‌ లైన్స్‌ రూపొందించారు. ఈ విషయమై సీపీ మాట్లాడుతూ..డిసెంబర్‌ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకలు నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. అశ్లీలతకు తావులేకుండా చూడాలన్నారు. పార్కింగ్‌ స్థలాల్లో ¬టల్‌ యాజమాన్యాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. డీజేలకు అనుమతి లేదని, ఈవెంట్‌ ఆర్గనైజర్లు విధిగా బౌన్సర్లను నియమించుకోవాలి. 45 డెసిబుల్స్‌ కంటే సౌండ్‌ బాక్స్‌ మించరాదని చెప్పారు. వీధుల్లో అశ్లీల నృత్యాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటమని సీపీ హెచ్చరించారు. మాదకద్రవ్యాల వినియోగంపై నిషేధం అమలులో ఉందన్నారు.  న్యూ ఇయర్‌ వేడుకలకు నగరంలో జరుగుతున్న ఏర్పాట్లపై సవిూక్షా సమావేశం నిర్వహించారు సీపీ అంజనీకుమార్‌. ఈవెంట్లకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. వేడుక జరిగే ప్రతి చోట సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో తెలిపారు. ఈవెంట్‌ చేసేవాళ్ళు ప్రైవేట్‌ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. 45 డేసిబల్‌ కంటే తక్కువ సౌండ్‌ పెట్టాలని, డ్రగ్స్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదని, డ్రగ్‌ వాడితే వ్యక్తులతో పాటు ¬టల్‌, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 31న రాత్రి పోలీసులు అందరూ డ్యూటీలో ఉంటారని.. షీ టీంలను రంగంలోకి దింపుతామని చెప్పారు. మైనర్‌లకు లిక్కర్‌ సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని, అసభ్యకర నృత్యాలు, డాన్సులు నిషేధమని తెలిపారు. అలాగే సీఎస్‌తోపాటు అన్ని ఇతర శాఖల అధికారులతో సమావేశమైన ఆయన.. రాష్ట్రపతి రాక సందర్భంగా ఏర్పాట్లను కూడా సవిూక్షించారు. ఈ నెల 21న నగరానికి రాష్ట్రపతి వస్తున్నారని… 4 రోజులు ఇక్కడ ఉంటారన్నారు. హాకింపేట్‌ నుంచి రాష్ట్రపతి భవనానికి రామ్‌నాథ్‌ రానున్నారని సీపీ తెలిపారు. అందువల్ల ఆయన రాక సందర్భంగా ఆంక్షలు ఉన్నాయని అన్నారు.