ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ వన్ పరీక్షలు

  నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో అక్టోబర్ 16 జనం సాక్షి:
    తెలంగాణా రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆదివారం  నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన  గ్రూప్-1 పరీక్షలు సజావుగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ప్రకటించారు.  ఆదివారం ఉదయమే కలెక్టర్ నాగర్ కర్నూల్ పట్టణంలోని గీతాంజలి హైస్కూల్, కొల్లాపూర్ లో సేంట్ మేరీ హైస్కూల్, జిల్లా పరిషత్  బాలికల హైస్కూల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.  అనంతరం నాగర్ కర్నూల్ పట్టణములో ని జిల్లా పరిషత్ బాలికల కళాశాలలో పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.   జిల్లాలో మొత్తం 5134 మంది విద్యార్థులు గ్రూప్-1 పరీక్ష రాసేందుకు కేటాయించగా 20 సెంటర్లు ఏర్పాటు చేసి పరీక్షలు సజావుగా నిర్వహించడం జరిగిందన్నారు.  5134 విద్యార్థులకు గాను 4107 మంది పరీక్షకు హాజరు కాగా 1027 మంది విద్యార్థులు గైర్హాజర్ అయ్యారని తెలిపారు. ఉదయం పోలీస్ ఎస్కార్ట్ మధ్యన జిల్లాలోని 20 పరీక్ష కేంద్రాలకు సకాలంలో ప్రశ్న పత్రాలు, ఓ.యం.ఆర్ షీట్ ల సీల్డ్ బాక్సులు చేరవేయగా 10 గంటలకు అన్ని సెంటర్లలో సిసి కెమెరాల పర్యవేక్షణలో బాక్స్ లు తెరచి ఓ.యం.ఆర్ షీట్లు విద్యార్థులకు అందజేసారు. జిల్లాలో  ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షను సజావుగా నిర్వహించినందుకు చీఫ్  సూపరిండెంట్, అధికారులు, ఇన్విజిలేటర్లను కలెక్టర్ అభినందించారు.