ప్రశ్నించే వారిని పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం
తగదు హుజూర్ నగర్ మార్చి 23 (జనంసాక్షి): ప్రశ్నించే వారిని పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం తగదని హుజూర్ నగర్ నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుక్కడపు మహేష్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఖమ్మం, వరంగల్, మహబుబాబాద్, కరీంనగర్ జిల్లాల పర్యటన సందర్భంగా ముందుస్తుగా పోలీస్ లు గురువారం హుజూర్ నగర్ యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారన్నారు. ఈ సందర్భంగా కుక్కడపు మహేష్ మాట్లాడుతూ తక్షణమే టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ చేసిన వారిని బాధ్యులని గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు. అరెస్టు చేసిన వారిలో నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ కందుల వినయ్, జనరల్ సెక్రటరీ పులి బాలకృష్ణ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ రెడపంగు రాము, కస్తాల వీరబాబు, ప్రచార కార్యదర్శి కస్తాల రవీందర్ ఉన్నారు.