– ప్రాజెక్టులో 25 గేట్లు ఎత్తివేత

  1.99లక్షల క్యూసెక్కల వరద నీరు విడుదల
చర్ల, జనం సాక్షి,జూలై 23: చర్ల మండలంలోని తాలి పేరు మధ్యతర ప్రాజెక్టుకు శనివారం భారీగా వరద పోటెత్తింది. ప్రాజెక్టు క్యాచ్ మెంట్ ఏరియా.. తెలంగాణ.. చతిస్గడ్ సరిహద్దుల్లో కురిసిన భారీ వర్షానికి శనివారం రాత్రి జలాశయంలోకి భారీగా ఇన్ఫ్లో  వచ్చి చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టులో 25 గేట్లను ఎత్తి ఉంచి 1.99 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరి కి విడుదల చేశారు. ఎగువ చత్తీస్గడ్ నుంచి చింతవాగు, రోటెంత వాగులు తోపాటు తాలిపేరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. తాలి పేరుకు అనుసంధానమైన చింతవాగు ఉదృతంగా ప్రవహిస్తున్నడంతో ప్రాజెక్టులో గంట గంటకు వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. దీంతో డి ఇ తిరుపతి ఆదేశాల మేరకు ఏ ఈ లు ఉపేంద్ర, శ్రీనివాసు అక్కడికి చేరుకొని వరద పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.  తాలిపేరు ఒక్కసారిగా ఉగ్రరూపంతో చూపడంతో దిగువ లోతట్టు న దోసెలపల్లి మీదుగా ప్రాజెక్టు వరకు ఉన్న రహదారి వరకు వరద నీరు పోటెత్తింది. దిగువనున్న పగిడి వాగు సైతం ఉదృతంగా ప్రవహిస్తూ ఉండటంతో లోతట్టు ప్రాంతాలు వరద గుప్పిట మునుగుతా యనే ఆందోళన చెందుతున్నరు.. ఇటీవల వచ్చిన భారీ వరదలు నుంచి ఇంకా తెరుకొక  ముందే తాలిపేరులో వరద ఉధృతి మరింత భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.. తాలి  పేరు ప్రాజెక్ట్లో వరద భారీగా పెరగడంతో లోతట్టు దండుపేట, కేశవాపురం, గొంపెనగుడెం గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.  క్రమేపి వరద  తగ్గుముఖం పడుతున్నట్లుగా  అధికారులు తెలిపారు. ప్రాజెక్టు కు వరద భారీ గా రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి పరిస్థితుల నైన ఎదుర్కొనేందుకు   సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Attachments area