ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా

గరిడేపల్లి, ఆగస్టు 22 (జనం సాక్షి): మండల కేంద్రంలోని గరిడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేసి వైద్యాధికారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. సిపిఎం మండల కార్యదర్శి యాకూబ్ మాట్లాడుతూ గ్రామాల్లో మలేరియా టైపాడ్ జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైద్యాధికారులు గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి ఇంటర్ టెస్టులు చేసి అందరికీ వైద్యం అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యులు వేలకు వేలు టెస్టుల పేరుతో మందుల పేరుతో డిపాజిట్ పేరుతో వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ప్రైవేట్ హాస్పిటల్ లేఖలపై సర్కిల్ చేయాలని రోగుల పరిస్థితి అడిగి తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు బాహుబలి బి శ్రీనివాస్, ఎస్ కే జానీ, సింగం నరసయ్య,  రాంబాబు, జిలకర పెంటయ్య, వెంకటమ్మ, వెంకన్న, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.