ప్రారంభానికి ముస్తాబైన డైట్ కళాశాల
భూపాలపల్లి( ప్రతినిధి) జూన్ 23 (జనం సాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లోని గాంధీనగర్ గ్రామంలో అన్ని హంగులతో పనులుపూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమైన డైట్ కళాశాల నూతన భవనము సముదాయము.ఈ కళాశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం 4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టేందుకు అట్టి నిర్మాణ పనులను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు అప్పగించగా అట్టి పను లను వేగవంతంగా పూర్తి చేసి అన్ని హంగులతో నిర్మాణ పనులను పూర్తి చేయడం జరిగిందని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏఈ మహేందర్ తెలిపారు. డైట్ కళాశాల నూతన భవనం నిర్మాణం అన్ని పనులు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కి తెలియజేయడం జరిగింది అన్నారు. ఈవిద్యాసంవత్సరంలో ఈ డైట్ కళాశాల ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా కలెక్టర్, భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి లను జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఈ డైట్ కళాశాలను ప్రారంభించి ఈవిద్యా సంవత్సరంలో అందుబాటులోకి తీసుకువచ్చి జిల్లా లోని విద్యార్థిని విద్యార్థులకు డైట్ విద్యా అందించాలని జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
