ప్రియతమ నాయకుని కోసం విద్యార్థులకు పుస్తకాల కిట్ ఇచ్చిన కుర్మజీ సాయిలు
రుద్రూర్ జులై 27 (జనంసాక్షి): బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ మాల్యాద్రి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన కుర్మాజీ సాయిలు, బుధవారం ఉదయాన్నే తమ ప్రియతమ నాయకుడిని కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.
రాత్రి నుండే తమ నాయకుని పుట్టినరోజు వేడుకలకు , మరియు గోశామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ రాకకు కావాల్సిన ఏర్పాటులను చూస్తూ. తమ స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తమ నాయకుని పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్టింగ్ చేయించి, అక్కడి విద్యార్థులకు
అవసరమైన నోట్ బుక్స్, పెన్నులు, స్కెచ్ పెన్నులు, పెన్సిల్, స్కేల్ మరియు ఇతర వస్తువుల తో కూడిన కిట్ ను విద్యార్థులకు అందచేశారు. ఈ సందర్భంగా కె సాయిలు మాట్లాడుతూ తమ నాయకుడు మాల్యాద్రి రెడ్డి బాన్సువాడ నియోజకవర్గంలో వియంఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి వస్తు, ధన రూపేణా ఎన్నో సహాయలు చేస్తున్నారని,
తమ నాయకుడుని ఆదర్శంగా తీసుకొనే తన స్వగ్రామంలో తనకు తోసిన సహాయాన్ని విద్యార్థులకు అందజేశానని తెలిపారు. తమ నాయకుడు
చక్కటి ఆరోగ్యం తో ఉన్నత పదవులు అవరోధించి, ప్రజలకు మరింత సేవలను అందించాలని ఆ భగవంతుని దీవెనలు , ప్రజల ఆశీసులు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.