ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ
గద్వాల నడిగడ్డ,సెప్టెంబర్ 26 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ సెంటర్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు నాయక్ సోమవారము ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కొన్ని ప్రైవేట్ హాస్పటల్లో లైసెన్స్ లేనందువల్ల సోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగిందనీ, ప్రైవేట్ ఆర్ఎంపి క్లినిక్ నందు సెలైన్ బాటిల్లు ఐ వి సెట్లు ఇంజక్షన్లు ఉండడం గమనించి క్లినిక్ ను సీజ్ చేయడం జరిగిందనీ, ఫార్మసీ సెంటర్లు కూడా తనిఖీ చేశామని, ఆర్ఎంపీ డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని ట్రీట్మెంట్ చేయరాదని, అటువంటి వాటిపై కఠినా చర్యలు తప్పవని చందు నాయక్ అన్నారు.ఈరోజు దాదాపు 8 సెంటర్లను తనిఖీ నిర్వహించగా బాబా సాహెబ్ హాస్పిటల్ కి పర్మిషన్ లేనందున నోటీసులు జారీ చేశామని, విజయ్ కుమార్ ఆర్ఎంపి కు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని కానీ క్లినిక్ నందు సెలూన్ బాటిల్స్ హైవి సెట్లు ఉన్నందున సీట్ చేయడం జరిగిందని, మరికొందరు అధికారులు వస్తున్నారని ముందుగానే షట్టర్ తాళం వేసి వెళ్ళిపోయారనీ, వీరిపై నిగా ఉంచి మళ్లీ తనిఖీ చేస్తామని ఆయన అన్నారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంట జిల్లా వైద్య సిబ్బంది ఎన్సిడి కోఆర్డినేటర్ శ్యాంసుందర్ సిసి వెంకటేష్ లు ఉన్నారు.