ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో హెల్పర్స్ తప్పనిసరిగా ఉండాలి – ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బుర్రు అనిల్ కుమార్

మోత్కూర్ ఆగస్టు 17 జనంసాక్షి : ప్రైవేట్ స్కూల్ బస్ లలో హెల్పర్స్ తప్పనిసరిగా ఉండాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బుర్రు అనిల్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మంగళవారం చౌటుప్పల్ మండల కేంద్రంలో ఉన్న మల్లిఖార్జున స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వలన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని స్కూల్ బస్ లో హెల్పర్ లేకపోవడం వలన బస్ రీటన్ తీస్తున్న క్రమంలో విద్యార్థి బస్ క్రింద పడి ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి కుటుంబానికి అన్నివిధాలుగా తోడ్పాటునందించి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని పాఠశాల యాజమాన్యం మీద క్రిమినల్ కేస్ పెట్టి పాఠశాలని మూసివేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ గా రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేశారు. అదే విదంగా అనేక స్కూల్ బస్ లలో కనీసం హెల్పర్స్ ని పెట్ట కుండా విద్యార్థుల జీవితాలతో అటాలాడుతున కూడా యం. ఇ. ఓ స్పందించక పోవడం సిగ్గు చేటని తీవ్రంగా విమర్శించారు.తక్షణమే ఎంఇఓ స్పందించి అన్ని ప్రైవేట్ పాఠశాల బస్సుల్లో హెల్పర్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఎంఇఓ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.