ప్రొఫెసర్ సాయిబాబా తదితరులపై యావజ్జీవ శిక్షను కొట్టివేసిన మహారాష్ట్ర హైకోర్టు
నాగపూర్ బెంచి తీర్పుపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ను రద్దు చేయాలి
— సిపిఐ( ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు
టేకులపల్లి, అక్టోబర్ 18( జనం సాక్షి): ప్రొఫెసర్ సాయిబాబా తదితరులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కేసులో జిల్లాకోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఏడేళ్ల విచారణ అనంతరం కొట్టివేసిన మహారాష్ట్ర హైకోర్టు. నాగపూర్ బెంచ్ తీర్పుపై సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడాన్ని వ్యతిరేకిద్దామ్ సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రొ,, సాయిబాబా తదితరులపై అన్యాయంగా, కుట్రపూరితంగా ఉపా కేసును బనాయించి, అంతే అధర్మంగ జిల్లా కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేయాలని దేశ వ్యాపితంగా, అంతర్జాతీయంగా అనేక హక్కుల సంఘాలు, మేధావులు సంవత్సరాల తరబడి ఆందోళనలు సాగిస్తున్న పరిస్థితుల్లో శిక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడం పౌర, ప్రజాస్వామిక హక్కులకి విఘాతం కల్గించడమే.ఆర్ధిక నేరగాళ్ళు, మోసగాళ్లు తదితర అనేక కేసులతో పాటు
దేశ ప్రజల భద్రతకు సంభందించి, జీవించే హక్కు కోసం, కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల సమస్యలపై, పౌరసత్య చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో వేసిన అనేక రిట్ పీటీషన్లు ఏండ్ల తరబడి పెండింగులో ఉండగా వాటిపై ఆశక్తి చూపని సుప్రీంకోర్టు, కోర్టు రాజకీయ ప్రేరేపితంగా సాయిబాబా కేసులో 24 గంటలలోపే అదీ సెలవు రోజున బెంచి నిర్వహించి స్టే ఇవ్వడం పాలకుల రాజకీయంలో న్యాయ వ్యవస్థ భాగంగా మారిందనడానికి నిదర్శనం అని సిపిఐ (ఎం ఎల్ ) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు అన్నారు.
తమ తమ సమస్యలపై పోరాడే ప్రజలకు ప్రజాస్వామికవాదుల మద్దతు అందకుండా చేయుటకు మేధావుల