ప్రో..జయశంకర్ సర్ తెలంగాణ స్ఫూర్తి ప్రదాత
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ , ఆగస్టు 06,,జనంసాక్షి,,,
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 88 జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలో జయశంకర్ విగ్రహానికి అటవీ, పర్యా, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించుకుంటూ, తెలంగాణ భావజాల వ్యాప్తికి జయశంకర్ తన జీవితాన్ని ధారపోశారని ఆయన సేవలను కొనియాడారు. జయశంకర్ సర్ తెలంగాణ సమాజానికి ఎన్నటికీ స్ఫూర్తి ప్రధాతగానే నిలుస్తారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, వ్యవయసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టుకున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ప్రతీ ఏటా ఆయన జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో నీళ్లు.. నిధులు.. నియామకాలు అనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాయన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి రెడ్డి, కలెక్టర్ ముశ్రఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, నిర్మల్ పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు మారుగోండ రాము, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిదులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.