ఫార్ములా `కారు రేసు కేసులో.. కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతి


` కేసులో నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గ్రీన్‌సిగ్నల్‌
హైదరాబాద్‌్‌(జనంసాక్షి):మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ ఫార్ములా `కారు రేసు కేసుకు సంబంధించి ఆయనపై విచారణ చేపట్టేందుకు గవర్నర్‌ అధికారికంగా అనుమతి మంజూరు చేశారు. ఈ కేసులోనిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేం దుకు గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గవర్నర్‌ అనుమతితో ఏసీబీ త్వరలోనే కేటీఆర్‌పై చార్జ్‌షీట్‌ దాఖలు చేయనుందని సమాచారం. ప్రభుత్వం ఈ విషయంలో లేఖ రాయడంతో ఫార్ములా ఈ`కార్‌ రేసింగ్‌ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతించారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు కేటీఆర్‌ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ`కార్‌ రేసింగ్‌లో రూ.54.88 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈక్రమంలో కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతి కోరుతూ గతంలో ఏసీబీ లేఖ రాసింది. ఆయన పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయంటూ అందులో పేర్కొంది. ఈక్రమంలో తాజాగా ఏసీబీ అధికారులకు అనుమతి ఇస్తూ గవర్నర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఫార్ములా ఈ`కార్‌ రేసింగ్‌ కేసులో త్వరలోనే ఏసీబీ ఛార్జీషీట్‌ దాఖలు చేయనుంది. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ`1 గా, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌ ను ఏ`2గా ఏసీబీ పేర్కొంది. ఇప్పటికే కేటీఆర్‌ ఈ కేసు విషయంలో ఏసీబీ విచారణకు నాలుగు సార్లు హాజరయ్యారు. ఈ కేసులో ఏ`2గా ఉన్న ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు ఇప్పటికే కేంద్రంలోని డీఓపీటీకు లేఖ రాశారు. గవర్నర్‌ అనుమతి నేపథ్యంలో, చార్జ్‌షీట్‌ దాఖలుకు ముందు ఏసీబీ అధికారులు మరోసారి కేటీఆర్‌ను లేదా ఇతర కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది. ఈ కేసుపై గవర్నర్‌ అనుమతి లభించడంతో, రాజకీయ వర్గాలలో, పరిపాలనా వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ త్వరలో దాఖలు చేయబోయే చార్జ్‌షీట్‌తో ఈ కేసు విచారణ కీలక మలుపు తిరగనుంది. ఫార్ములా ఈ`కారు రేసులో క్విడ్‌ ప్రోకో జరిగినట్టు ఏసీబీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. రూ.54.88 కోట్ల నిధులు దారి మళ్లింపుపై ఆరోపణలు చేసింది. ఇక, 2024లో ఫార్ములా ఈ`కారు కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కార్‌ రేస్‌ వ్యవహారంలో 2024 డిసెంబర్‌ నెలలో ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కేసు విచారణలో భాగంగా ఇప్పటికే కేటీఆర్‌ను రెండు సార్లు, ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌ను 3 సార్లు ఏసీబీ అధికారులు విచారించారు. తాజాగా ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. కేసుకు సంబంధించిన నివేదికను అవినీతి నిరోధక శాఖ( ఏసీబీ) అధికారులు మంగళవారం తెలంగాణ ప్రభుత్వానికి అందించారు. ప్రాసిక్యూషన్‌ అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కేటీఆర్‌ మున్సిపల్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను ఈ కేసులో ఏ1గా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా` ఈ కార్‌ రేసు నిర్వహణ కోసం యూకేకు చెందిన ఫార్ములా`ఈ ఆపరేషన్స్‌, ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, తెలంగాణ పురపాలకశాఖ 2022 అక్టోబరు 25న ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం కార్‌ రేస్‌ నిర్వహణకు అయ్యే ఖర్చును స్పాన్సర్‌గా ఉన్న ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భరించాలి. అలాగే కార్‌ రేసు నిర్వహణకు వీలుగా తెలంగాణ పురపాలక శాఖ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా 2023 ఫిబ్రవరి 11 జరిగిన రేస్‌ కోసం తెలంగాణ పురపాలక శాఖ తరుఫున హెచ్‌ఎండీఏ రూ.12 కోట్లు ఖర్చు చేసింది. రేసు నిర్వహణ ఖర్చును స్పాన్సర్‌గా ఉన్న ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ భరించింది.