ఫూలే విదేశీ విద్యానిధి పథకం కింద ఆర్థిక సాయం
మహబూబ్‌నగర్,ఆగస్ట్9(జనం సాక్షి): జ్యోతిబాఫూలే విదేశీ విద్యానిధి పథకం కింద ఉన్నత విద్యాభ్యాసానికి సాయం కావాల్సిన బీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారి యన్.విద్యాసాగర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్‌సైట్‌లో ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలలోపు ఉండి, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించకూడదని తెలిపారు. ఇంజనీరింగ్, సైన్స్, వైద్యం, మేనేజ్‌మెంట్, వ్యవసాయం, నర్సింగ్, సామాజిక శాస్త్రాల్లో అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో 60 శాతానికి పైగా మార్కులు, టోఫెల్‌లో 60శాతం, ఇఈఎల్‌టీఎస్‌లో 6.0 జీమ్యాట్‌లో 500, పీటీఈలో 50శాతం మార్కులు ఉన్న వారికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఎంపికైన వారికి రెండు విడతల్లో మొత్తం రూ. 20 లక్షల సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కులం, ఆధాయం, జనన ధ్రువీకరణ ప త్రాలు, ఆధార్, ఈపాస్ ఐడీ, విద్యార్హ త పత్రాలు, బ్యాంక్ పాస్‌బుక్, ఫొటోలు జత చేయాలని సూచించారు. అర్హులను గుర్తించి ఉన్నత విద్యకు సాయం అందిస్తామని అన్నారు.