ఫైనల్‌కు భారత్‌


కార్డిఫ్‌ వేల్స్‌ : చాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా సెమిఫైనల్‌కు చేరిన భారత్‌,సెమిఫైనల్‌లో శ్రీలంకతో జరిగని మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేసింది. 180  పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ కేవలం 35 ఓవర్లలో 2 వికెట్టు కోల్పోయి ఛేదించింది. భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్నందించారు. ధావన్‌ మళ్లీ అర్థ సెంచరీతో చెలరేగారు. ధావన్‌తో పాటు కోహ్లీ కూడా అర్థ సెంచరి చేయడంతో భారత్‌ సునాయస విజయం సాదించింది.  బౌలింగ్‌లో బౌలర్లందరూ సమిష్ఠిగా రాణించి శ్రీలంకను కేవలం 180 పరుగులకు కట్టడి చేశారు. బౌలింగ్‌లో ఇశాంత్‌ శర్మ 3, అశ్విన్‌ 3 వికెట్లు తీయగా జడేజా భువనేశ్వర్‌ కుమార్‌ తలో వికెట్‌ తీశారు. భారత్‌ బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ 33, ధావన్‌ 68, కోహ్లీ 59 పరుగులతో నాటౌట్‌, రైనా 5 పరుగులు నాటౌట్‌గా రాణించారు. శ్రీలంక బ్యాటింగ్‌లో జయవర్థనే 38, మ్యాథ్యూస్‌ 51, మెండిస్‌ 25 పరుగులు చేయగా దిల్షాన్‌ 18, సంగక్కర 17 పరుగులు తప్ప ఏ ఒక్కరు రాణించలేక పోయారు. శ్రీలంక బౌలింగ్‌లో మ్యాథ్యూస్‌, మెండిస్‌ తలో వికెట్‌ తీశారు. ధావన్‌, కోహ్లీలు అర్థ సెంచరీతో చెలరేగడంతో 15 ఓవర్లు మిగిలిఉండగానే సునాయసంగా విజయాన్ని సాధించింది. హాఫ్‌ సెంచరీతో రాణించిన శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన ధోనీ కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్‌ను రసవత్తరంగా సాగించాడు.

శ్రీలంక బ్యాటింగ్‌ :

పెరేరా (సి)సురేష్‌ రైనా (బి)భువేనేశ్వర్‌ కుమార్‌ 4(4I1), దిల్షాన్‌ 18(4I2), కేసి సంగక్కర (సి)సురేష్‌ రైనా, (బి)ఇషాంత్‌ శర్మ 17(4I1), తిరినూన్నె (సి)సురేష్‌ రైనా (బి)ఇషాంత్‌ శర్మ 7(4I1), జయవర్థనె (బౌల్డ్‌) రవీంద్ర జాడెజా 38(4I3), మాథ్యూస్‌ (సి)భువేనేశ్వర్‌ కుమార్‌ (బి)అశ్విన్‌ 51 (4I1, 6I1), జీవన్‌ మెండీస్‌ (స్టం)ధోనీ (బి) ఆర్‌. ఆశ్విన్‌ 25(4I1) థిస్సెరా ఫెరెరా (సి)షికార్‌ ధావన్‌ (బి) ఇషాంత్‌ శర్మ 0, కుల శేఖర (బి) ఆర్‌ ఆశ్విన్‌ 1, మలింగ నాటౌట్‌ 7(4I1)మొత్తం : 181 (8 వికెట్లు 50 ఓవర్లలో)

రన్‌ రేట్‌ 3.52, ఎక్స్‌ట్రాలు : 11 (బైస్‌-0, వైడులు-11, నోబాల్‌-0, లెగ్‌ బైస్‌-2, పెనాల్టీ-0)

కోల్సోయిన వికెట్లు : 1-6 (2.4), 2-36 (15.2), 3-41 (17.6), 4-119 (36.1), 5-158 (45.5), 6-160 (46.5), 7-164 (47.5), 8-171(49.1)

భారత్‌ బౌలింగ్‌ : భువనేశ్వర్‌ 9.0-2- 18-1, తెజాశ్వి యాదవ్‌ 8.0-0-30-0, ఇషాంత్‌ శర్మ 9.0-1-33-3, రవీంద్ర జడేజ 10.0- 1-33- 1, ధోనీ 4.0-0-17-0, ఆశ్విన్‌ 10.0-1-48-3

భారత్‌ బ్యాటింగ్‌ :

రోహిత్‌ శర్మ (బౌల్డ్‌)ఆంగ్లో మాథ్యూస్‌ 33(4I4), షికార్‌ ధావన్‌ (స్టం) కెసి సంగక్కర (బి) .ఈవన్‌ మెండీస్‌ 68(4I6, 6I1), విరాట్‌ కోహ్లి నాటౌట్‌ 58(4I4, 6I1), సురేష్‌ నాటౌట్‌ 7(4I1)

మొత్తం : 182 (2 వికెట్లు 35 ఓవర్లలో)

రన్‌ రేట్‌ 5.20, ఎక్స్‌ట్రాలు : 16 (బైస్‌-1, వైడు లు-10, నోబాల్‌-0, లెగ్‌ బైస్‌-5, పెనాల్టీ-0)

కోల్సోయిన వికెట్లు : 1-77(16.6), 2-142 (31.5) శ్రీలంక బౌలింగ్‌ : కులశేఖర 10.0-0- 45-0, మలింగ 8.0-0-45-0, థిస్సె రా పెరెరా 6.0-0-25-0, ఆంగ్లో మాథ్యూస్‌ 4.0-0- 10-1, రంగన హేరాత్‌ 4.0-0-14-0, జీవన్‌ మెండీస్‌ 3.0-0-28-1