ఫైనల్‌ కన్నా

పిల్లల చదువే ముద్దు
న్యూయార్క్‌ ,మే 27 (జనంసాక్షి):

ఐపీఎల్‌ ఆరోసీజన్‌ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌ ఆడుతున్నా ఇద్దరు ప్రముఖ వ్యక్తులు మాత్రం కనిపించలేదు. వారే ఆ ఫ్రాంచైజీ ఓనర్లైన ముఖేష్‌ అంబానీ , నీతా అంబానీ… జట్టు ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతున్నా ఖచ్చితంగా హాజరయ్యే నీతా అంబానీ కూడా ఫైనల్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించలేకపోయారు. దీనికి కారణం వారి పిల్లల చదువే… ముఖేష్‌ , నితా కుమా రుడు , కుమార్తె న్యూయార్క్‌లో డిగ్రీ పట్టా అందుకుంటున్నందున ఫైన ల్‌కు హాజరు కాలేకపోయారు. క్రికెట్‌ మ్యాచ్‌ కంటే తమ పిల్లల ఆనందానికే వారు ప్రాధాన్యతనిచ్చారు. దీంతో తమ ఫ్రాంచైజీ తొలిసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలుచుకున్నా ప్రత్యక్షంగా ఆస్వాదించే అవకాశాన్ని చేజార్చుకున్నారు. అయితే ఎప్పటికప్పుడు మ్యాచ్‌ వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆటగాళ్ళందరికీ అభినందనలు కూడా చెప్పారని వెల్లడించాయి. ముఖేష్‌ , నీతా అంబానీలు స్వదేశానికి వచ్చిన తర్వాత జట్టుకు ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది.