ఫోటో రైట్ అప్ లబ్ధిదారులకు పెన్షన్ మంజూరి పత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే సుంకే రవి శంకర్

పెన్షన్ల వయోపరిమితి తగ్గింపు చరిత్రలో నిలిచిపోతుంది
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నs ఘనత కెసిఆర్ కి దక్కుతుంది
చొప్పదండిలో ఆసరా పింఛన్ లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చొప్పదండి, ఆగస్టు 28 (జనం సాక్షి ):వృద్ధులకు అందజేస్తున్న ఆసరా పింఛన్ల వయో పరిమితి తగ్గింపు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జి ఆర్ ఆర్ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన ఆసరా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వృద్ధులు వితంతువులకు వికలాంగులకు 200 రూపాయలు పెన్షన్ మాత్రమే వచ్చేదని దానితో వారికి ఇబ్బంది పడేవారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఆసరాగా ఉండాలని ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్ధులు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ను రెండు వేలకు పెంచి వారికి కొండంత భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న రెండు వేల పెన్షన్స్ తో ఇండ్లలో ఉన్న వృద్ధులను వారి కొడుకులు కోడండ్లు చక్కగా చూసుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వృద్ధాప్యంలో చాలామంది ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లేవారని, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం అందజేస్తున్న రెండు వేల పెన్షన్తో ఇంట్లోనే ఉంటూ తమ కొడుకు కోడలు మనుమడు మనవరాళ్లతో హాయిగా గడిపేలా చేసిన ఘనత కేసిఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పెన్షన్ కు వయోపరిమితి 57 సంవత్సరాలకు తగ్గించి మరి కొంతమందికి ఆసరా నిలిచిన ఘనత కేసిఆర్కే దక్కుతుందని కొనియాడారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ వచ్చి తీరుతుందని, అర్హులుగా ఉండి పెన్షన్ జాబితాలో పేరు లేని వారు నేరుగా తనను సంప్రదించి పెన్షన్ పొంది ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ -భూమారెడ్డి, వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి -సాంబయ్య, ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పిటిసి మాచర్ల సౌజన్య- వినయ్ ,సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్ ,వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, కౌన్సిలర్లు మడూరి శ్రీనివాస్, కొత్తూరి మహేష్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి ,పట్టణ అధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి ,రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు గడ్డం చుక్కారెడ్డి, సర్పంచులు వెల్మ నాగిరెడ్డి, పెద్ది శంకర్, గుంట రవి, చిలుక లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.