బంగారం కొనడమంటే ఇష్టం:

 


సచిన్‌

హైదరాబాద్‌: అక్షయ తృతీయ సందర్బంగా వాల్యూ మార్ట్‌ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సీనియర్‌ క్రికెటర్ల ముఖాలు సంతకాలతో కూడిన సచిన్‌ టెండుల్కర్‌ బంగారు నాణేలను పరిమితమైన సంఖ్యలో ఆ సంస్థ విడుదల చేసింది. వాల్యూ మార్ట్‌ అండ్‌ జెవెల్స్‌ సంస్థ లక్ష సచిన్‌ టెండూల్కర్‌ బంగారు నాణేలను విడుదల చేసింది ఒక్కో బంగారు నాణెం బరువు 10 గ్రాములు ఉంది. తన చిత్రాన్ని ముద్రించిన గోల్డ్‌ కాయిన్‌ను సచిన్‌ టెండూల్కర్‌ విడుదల చేశాడు. 24 క్యారెట్ల ఆ గోల్డ్‌ కాయిన్‌ ధర 34 వేల రూపాయలు. ఆ కాయిన్స్‌ వాల్యూ మార్ట్‌ డాట్‌ కామ్‌లోనూ దేశంలోని ప్రముఖ ఆభరణాల దుకాణాల్లోనూ అందుబాటులో ఉంటాయి. ఆ సంస్థ బ్రాఇండ్‌ అంబాసిడర్‌గా సచిన్‌ టెండూల్కర్‌ను మూడేళ్లుకు గాను ఈ ఏడాది ఫిబ్రవరిలో నియమించుకుంది. మైదానంలో తనకు అనేక సువర్ణ క్షణాలున్నాయని, కొన్ని అత్యద్భుతమైన జ్ఞాలకాలు. అయితే ఇది ప్రత్యేకమైందని సచిన్‌ టెండూల్కర్‌ అన్నాడు. హిందూ క్యాలెండర్‌లె అక్షయ తృతీయ ప్రత్యేమైందని అందరికీ ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నాడు. తాను బంగారం కొనాలని అనుకుంటానని, మెడపై మంచి బంగారం గొలుసు ఉంటే ఎంతో బాగుంటుందని యుక్తవయస్సు నుంచే తాను కంఠాభరణాన్ని దరిస్తున్నారని ఆయన చెప్పాడు. ఆభరణాలుగానే కాకుండా బంగారాన్ని పెట్టుబడిగా కూడా వాడవచ్చునని ఆయన అన్నారు. బంగారం కోనడం నుంచి మహిళలను దూరం చేయలేమని ఆయన అన్నాడు. క్రీడాకారుల్లో కూడా బంగారం ఆదరణ పొందిందని, వెస్టిండిస్‌ క్రీడాకారుల