బంజారా బిడ్డ నిఖిల్ మరణానికి కారకులైన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి
జి హెచ్ పి ఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు నగేష్ రాథోడ్ హుజూర్ నగర్, అక్టోబర్ 13 (జనం సాక్షి): గిరిజన బంజారా బిడ్డ నిఖిల్ మరణానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జి హెచ్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు నగేష్ రాథోడ్ అన్నారు. గురువారం హుజుర్ నగర్ పట్టణ పరిధిలోని బంజారా భవనం నందు జరిగిన నాయకుల సమావేశం లో నగేష్ రాథోడ్, నియోజకవర్గ సేవాలాల్ ఉత్సవ కమిటీ కన్వీనర్ బాణావత్ వెంకటేశ్వర్లునాయక్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన గిరిజన బంజారా బిడ్డ దారావత్ నిఖిల్ నాయక్ మృతిపై అధికారులు సత్వరమే విచారణ జరిపి కారుకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వారి కుటుంబానికి ఆర్థిక భరోసాను ప్రభుత్వం చేకూర్చాలని అన్నారు. ఈ కార్యక్రమం లో గిరిజన హక్కుల పోరాట సమితి సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా నాగు నాయక్, బాణావత్ శ్రీను నాయక్, మోతిలాల్ నాయక్, తులిసి నాయక్, భట్టు నాయక్, బాపూరావు, లాలాజీ సింగ్, మల్లికార్జున్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.