బండి ” మౌనదీక్ష
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి) :
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రమైన కరీంనగర్ లోని స్థానిక వర లక్ష్మి గార్డెన్ లో బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ మౌన దీక్ష చేపట్టారు. పోడు భూములు, ధరణి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దీక్షకు పూనుకున్నారు.
పోడుభూముల సమస్య పరిష్కరిస్తానన్న కేసీఆర్ మాటలు గుర్తు చేస్తూ
“కుర్చీ వేసాం… వచ్చి సమస్యలు పరిష్కరించాలని” సింబాలిక్ తో వేదికపై కెసిఆర్ కు కుర్చీ ఏర్పాటు చేశారు.12 గంటలకు దీక్ష ముగుస్తుంది. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అనంతరం బండి సంజయ్ జన్మదిన వేడుకలను స్థానిక కార్యకర్తలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మాజీ పార్లమెంట్ సభ్యులు రవీంద్ర నాయక్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఉమారాణి ,మాజీ ఎమ్మెల్యే జగపతిరావు జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ జిల్లా కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ మర్రి భావన జితేందర్ ఆనంద్, ఆవుదుర్తి శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు