బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తూ టీఎన్జీవోస్ నిరసన

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 31(జనం సాక్షి)

 

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఉద్యోగ సంఘాల మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీఎన్జీవోస్ కేంద్ర సంఘం పిలుపుమేరకు సోమవారం వరంగల్ జిల్లా టిఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఎంజీఎం కూడలియందు జిల్లాలోని ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా వరంగల్ జిల్లా టిఎన్జిఓస్ అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ మాట్లాడుతూ ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతినేలా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పదేపదే చేస్తున్న  అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అదేవిధంగా ఉద్యోగుల మనోభావాలను దెబ్బ తినే విధంగా మాట్లాడిన బండి సంజయ్ తక్షణమే బేశరత్తుగా ఉద్యోగ సంఘాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా టీఎన్జీవోస్ నాయకులు ఎప్పుడూ తమ జీతాల కోసం కాకుండా ప్రజల, ఉద్యోగుల జీవితాల కోసం ఆనాడు తెలంగాణ తొలి దశ ఉద్యమం నుండి నేటి మలిదశ ఉద్యమం వరకు తమ ఉద్యోగాలను ఫణంగా పెట్టి పోరాడిన విషయాన్ని బండి సంజయ్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

ఆనాడు ఈనాడు ఎప్పుడైనా బండి సంజయ్ లాంటి నాయకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న లేదని, వారికి ఉద్యోగ సంఘాలను విమర్శించే అర్హత లేదని తెలిపారు.

అదేవిధంగా బండి సంజయ్ తక్షణమే క్షమాపణ చెప్పకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని, రేపటి నుండి ఉద్యోగులందరూ విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపడతారని తెలియజేశారు.

టీఎన్జీవోస్ సంఘం తన 75 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు ప్రభుత్వాలతో లాలూచీ పడలేదని, అవసరమైతే తమ హక్కుల కోసం ప్రభుత్వాలతో పోరాడి హక్కులను సాధించుకున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజె వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, సహా అధ్యక్షులు హేమ నాయక్, ఉపాధ్యక్షులు మురళీధర్ రెడ్డి, వేముల వెంకటేశ్వర్లు, రాజు, యాకమ్మ, సంయుక్త కార్యదర్శులు చందర్ రావు, రవీందర్, శ్రీ జ్యోతి, సునీతా నాయర్, ఎంజీఎం యూనిట్ కార్యదర్శి రమేష్, రామకృష్ణ, మెడికల్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు మాడిశెట్టి శ్రీనివాస్, రజనీకాంత్, విద్యాశాఖ ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్, ఎనుమముల మార్కెట్ కమిటీ కార్యదర్శి రాహుల్, మార్కెట్ ఫోరం అధ్యక్షుడు జన్ను భాస్కర్, కాంటాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు శంకేసి రాజేష్, గజ్జల కుమారస్వామి, యూనియన్ నాయకులు బుచ్చయ్య, సుదర్శన్, సతీష్, ఆనందరావు, నాగేశ్వరరావు, సత్యనారాయణ, అశోక్,  సుకన్య, శ్రీకళ, అర్చన, మరో తరగతి ఉద్యోగుల నాయకులు బిక్షపతి, ప్రసాద్, అజయ్, మల్లేశం, యూసుఫ్, పాషా తదితర ఉద్యోగ సంఘాల బాధ్యులు ఉద్యోగులు పాల్గొన్నారు.