బడ్జెట్లో స్పష్టత లేదన్న మన్మోహన్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): బ్జడెట్లో చెప్పిన అంశాలపై స్పష్టత లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. బ్జడెట్‌ నిరాశాజనకంగా ఉందని చెప్పారు. లక్ష్యాలు బాగున్నాయిగాని వాటిని సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికలు కరవయ్యాయన్నారు. దేశంలో 70శాతం మంది ప్రజలు గ్రావిూణ ప్రాంతాల్లోని నివసిస్తున్నారని వాటి అభివృద్ధికి ప్రతిపాదనలే లేవని విమర్శించారు.కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌ జైట్లి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పై కాంగ్రెస్‌ పెదవి విరిచింది. దాంతో పాటు టిడిపి కూడా నిరాశ వ్యక్తం చేసింది. కేంద్ర మాజీ మంత్రి,కాంగ్రెస్‌ ఎమ్‌.పి కమలనాద్‌ మాట్లాడుతూ బడ్జెట్‌ ప్రసంగం అంతా కమిటీలు,కమిషన్‌ లు,ప్రమాణాలతో నిండి ఉంది తప్ప ప్రజలకు పనికి వచ్చేది లేదని కమలనాద్‌ అన్నారు.ఆర్దిక వ్యవస్థకు ఊతం ఇచ్చే అంశాలు ఏవీ లేవని ఆయన అన్నారు. కాగా టిడిపి ఎమ్‌.పి రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ ఈ బడ్జెట్‌ లో ఎపికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం నిరాశ కలిగించిందని అన్నారు.తాము గత కొంతకాలంగా ఎంత ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోయిందని అన్నారు. అంటే కొంతకాలం క్రితం అనంతపురం ఎమ్పి జెసి దివాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవం అని తేలిందా?

.