బడ్జెట్‌లో కార్పొరేట్‌లకే పెద్దపీట

C
ఉసురుతీసిన వేతనజీవులు,మధ్యతరగతి

ఆదాయపన్నుల శ్లాబులో మార్పులేదు

ఇవి ప్రియం , ఇవి చౌక

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28(జనంసాక్షి):

ఇవి చౌక

బడ్జెట్‌లో విధించిన పన్నుల ఆధారంగా వివిధ వస్తులపై ధరల ప్రభావం ఉండబోతోంది. పాదరక్షలు, ఎలక్గిక్‌ బైక్స్‌, కంప్యూటర్‌ విడిభాగాలు, రత్నాలు, వజ్రాలు, ఎల్‌సి.డి చిన్న టీవీలు, ఎలక్గిక్‌ కార్లు, మొబైల్‌ఫోన్లు, వంట నూనెలు, హెచ్‌ఐవీ మందులు, సబ్బులు, మ్యూజియం, జూ సందర్శన, మైక్రో ఓవెన్‌, అంబులెన్స్‌ సర్వీసులకు ధరలు తగ్గనున్నాయి.

ఇవి ప్రియం

ఇక సిగరెట్లు, పాన్‌మసాలా, రేడియో టాక్సీ ఛార్జీలు, విలాసవంతమైన బైక్‌లు, సెట్‌టాప్‌ బాక్సులు, చలువరాళ్లు, దిగుమతి పడవలు, స్పోర్ట్స్‌ వాహనాలు, విదేశీ కార్లు, పాలిథిన్‌ సంచులు, మద్యం ధరలు పెరగనున్నాయి.

మనీల్యాండరింగ్‌ చట్టాల్లో మార్పులు, సవరణలు

ఈ సమావేశాల్లోనే నల్లధనంపై బిల్లు

ప్రణాళికా వ్యయం: 4,65,277 కోట్లు: జైట్లీ

ప్రణాళికేతర వ్యయం రూ. 13,12,200 కోట్లు

మొత్తం వ్యయం రూ.17,77,477 కోట్లు

పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవాలకు రూ.100 కోట్లు

జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, తమిళనాడులో ఎయిమ్స్‌

విద్యారంగానికి రూ.68,968 కోట్లు కేటాయింపు

5లక్షల గ్రామాలకు వైఫై సౌకర్యం

రక్షణ రంగానికి రూ. 2,46,727 కోట్లు

లక్ష కంటే కొనుగోలు దాటితే పాన్‌ తప్పనిసరి

కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28(జనంసాక్షి): మోడీ అధికారంలోకి వచ్చాక ప్రజలు  భారీ అంచనాలు పెట్టుకున్నారు. తమకు ఊరట కలిగించే నిర్ణయాలు ఉంటాయని భావించారు. తమకు ఊరట ఉంటుందని వేతన జీవులు, మధ్యతరగతి ప్రజలు ఆశపడ్డారు. కానీ ఇలాంటి వాసనలు ఏవీ లేకుండా సాదాసీదాగా బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన కేద్ర ఆర్థికశాఖ మంత్రి జైట్లీ ప్రజల ఆశలకు భిన్నంగా బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రవేశ పెట్టారు. పేద మధ్యతరగతి ప్రజలు పెదవి విరిచేలా ఆయన వ్యవహరించారు. ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ 2015-16 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్పొరేట్‌ వర్గాలకు పెద్దపీట వేసి.. సామాన్యుడికి మాత్రం నిరాశనే మిగిల్చినట్లయింది. ఏ వర్గానికి కూడా పెద్దగా ఉత్సాహం కల్పించే చర్యలు తీసుకోలేదు. అయితే కార్పోరేట్‌ వర్గాలకు ఊరట కల్పించే విధంగా కార్పోరేట్‌ పన్నును తగ్గించారు. ఇక బ్యాంకుల ద్వారా లావాదేవీలను ప్రోత్సహించేలా క్రెడిట్‌, డెబిట్కార్డులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. అంతేగాకుండా నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేలా చూశారు. ప్రణాళికా వ్యయం 4,65,277 కోట్లు కాగా,  ప్రణాళికేతర వ్యయం రూ. 13,12,200 కోట్లుగా ప్రతిపాదనలు చేశారు. అయితే రోణ రంగానికి మాత్రం కేటాయింపులను పెంచారు.  మొత్తం వ్యయం రూ.17,77,477 కోట్లుపన్ను రాయితీల కోసం ఎంతగానో ఎదురుచూసిన సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు పెద్దగా ఎలాంటి ప్రయోజనాలు కనిపించలేదు. ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై పన్ను రాయితీ పరిమితి పెంచుతున్నట్లు ప్రకటించినా.. వాస్తవానికి ఏడాదికి రూ. 25 వేల ప్రీమియం చెల్లిస్తే.. 40 ఏళ్లు దాటిన వారికి సుమారు రూ. 15 లక్షల ఆరోగ్య బీమా వస్తుంది. అంత మొత్తాన్ని సామాన్య, మధ్యతరగతి ఉద్యోగులు సాధారణంగా చేయించుకునే అవకాశం ఉండదు. అయితే ఆరోగ్య భీమాకు సంబంధించి మాత్రం పరిమితులను పెంచారు. ఆరోగ్య భీమాకు పరిమితిని రూ 15,000 నుంచి రూ. 25,000 కు పెంచారు. అలాగే వృద్ధుల ఆరోగ్య భీమా మొత్తాన్ని కూడా ఎంచడం ద్వారా కొంత ఊరట కల్పించారు. పైపెచ్చు సేవాపన్నును కూడా 12.36 శాతం నుంచి 14 శాతానికి పెంచడం వల్ల దాదాపు అన్ని ఖర్చులూ బాగా పెరుగుతాయి. కార్పొరేట్‌ పన్నును మాత్రం ఇప్పుడున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. ఇప్పుడున్న 30 శాతం పన్ను వల్ల ఆశించిన మొత్తంలో వసూళ్లు రావడం లేదని, అందుకే ఈసారి 25 శాతానికి తగ్గిస్తున్నామని చెప్పారు. ఇది నాలుగేళ్ల పాటు వర్తిస్తుందన్నారు. ఆ రకంగా కార్పొరేట్‌ వర్గాలకు పెద్దపీట వేస్తూ సామాన్యుడిపై చిన్నచూపు చూసినట్లుగా జైట్లీ బడ్జెట్‌ ఉందని భావించవచ్చు. బడ్జెట్‌లో ఆదాయం పన్ను పరిమితిని గణనీయంగా పెంచుతారని మధ్య తరగతి ప్రజానీకం ఆశించింది. అయితే ఆదాయం పన్నుల విధానంలో ఎట్టిమార్పు లేదని అరుణ్‌ జైట్లీ తమ బడ్జెట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం ద్వారా స్పష్టం చేశారు. పెరుగుతన్న ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా పన్ను స్లాబుల్లో మార్పులు ఆశించారు.  ఆదాయం పన్ను శ్లాబ్‌లో కూడా మార్పులేదన్న వార్తలు ఉద్యోగస్థులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఐటి పరిమితిలో మార్పు లేదని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లి ప్రకటించారు. సంపద పన్ను రద్దు చేసి, కోటి రూపాయల ఆదాయం మించినవారి నుంచి రెండు శాతం అదనంగా పన్ను వసూలు చేయాలని నిర్ణయించారు. ఆదాయ పన్ను మినహాయింపులు ఉండవచ్చన్న ప్రచారం జరిగినా, అలాందేవిూ లేదు. ఇక లక్ష రూపాయలు దాటిన అన్ని లావాదేవీలకు పాన్‌ కార్డు తప్పని సరి చేశారు. ఇది కూడా సామాన్యులకు ఇబ్బంది కలిగించేదిగానే చూడాలి.

నల్లధనంపై కొరడా

నల్లధనం నిర్మూలనకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్‌ జైట్లి చెప్పారు. ఇందుకోసం క్రెడిట్‌ ,డెబిట్‌ కార్డులను ప్రోత్సహించడానికి పదకం ప్రకటిస్తామని అన్నారు.దేశాన్ని నగదు రహిత లావాదేవీలు ఉన్న దేశంగా మార్చడానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు.ప్రతి ఏడాది సుమారు 800 టన్నుల నుంచి వెయ్యి టన్నుల బంగారం దిగుమతి అవుతోందని అరుణ్‌ జైట్లి చెప్పారు. బంగారం వృధాగా ఉండకుండా బంగారం పై బాండ్లు జారీ చేసే విషయం పరిశీలిస్తున్నామని అన్నారు.కేంద్రం కొత్తగా ఐదు అల్టా మెగా పవర్‌ ఎ/-లాంట్‌ లను ఏర్పాటు చేస్తుందని, వీటి ని పారదర్శకంగా కేటాయిస్తామని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లి చెప్పారు. ఇక  విదేశీ ఆస్తులు వెల్లడించకపోయినా, వివరాలు సక్రమంగా లేకపోయినా కఠిన శిక్ష అమలుచేస్తారు.  రూపాయి ఆదాయం లేకపోయినా విదేశీ ఆస్తుల వివరాలు ఇవ్వాల్సిందే.  దేశంలో నల్లధనం నియంత్రణకు కేంద్రం కట్టుబడివుందని అరుణ్‌జైట్లీ అన్నారు. బినావిూ ఆస్తులకు ఎక్కువ పన్ను విధిస్తామన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్టాల్రకు సమాన అధికారం అందించామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. 9 నెలల పాలనలో ఆర్థికాభివృద్ధిలో అనేక చర్యలు తీసుకున్నామన్నారు. దేశంలో స్కామ్‌ల పాలన అంతమైందని, పారదర్శక పాలన మొదలైందని జైట్లీ తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ విశ్వసనీయత ప్రపంచవ్యాప్తంగా బాగా పెరిగిందని చెప్పారు. వృద్ధి, పెట్టుబడులు పెంచడం, సంపద అందరికీ పంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతానికి చేరుకుంటుందని అంచనా మంత్రి వేశారు. ద్రవ్యోల్బణం 5.1 శాతానికి తగ్గిందని ఆయన చెప్పారు. విదేశీ మాదకద్రవ్యం నిల్వలు బాగా పెరిగాయన్న జైట్లీ విదేశీ మారకం నిల్వలు 340 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయన్నారు. రెండంకెల వృద్ధిరేటు సాధించే స్థితికి చేరుకున్నామని జైట్లీ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా తీర్పునకు అనుగుణంగా అందివచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆయన తెలిపారు. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న పరిస్థితులన్నీ అధిగమిస్తున్నామని జైట్లీ పేర్కొన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా 50 లక్షల మరుగుదొడ్లు నిర్మించామని చెప్పిన ఆయన 6 కోట్ల టాయిలెట్ల నిర్మాణమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 12.5 కోట్ల కుటుంబాలు ఇప్పుడు జనధన యోజనలో చేరాయని తెలిపారు. 2016 ఏప్రిల్‌ 1 నుంచి సరుకులు, సర్వీసుల పన్ను అమల్లోకి వస్తుందని జైట్లీ ప్రకటించారు. 2020 నాటికి దేశంలో పూర్తిగా గ్రామాల విద్యుదీకరణ అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో అందుబాటులో వైద్య సేవలు అందజేస్తామన్నారు. ప్రతి ఐదు కిలోవిూటర్లకు ఒక ప్రాథమిక పాఠశాలను నిర్మిస్తామన్నారు. మిగితా రాష్టాల్రతో సమానంగా ఈశాన్య రాష్టాల్రను అభివృద్ధి చేస్తామని అరుణ్‌జైట్లీ తెలిపారు. 5 ఏళ్ల లోపు వారు మూడింట రెండొంతుల మంది ఉన్నారని, యువతకు ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. పన్నుల్లో 42 శాతం రాష్టాల్రకు చెల్లింపులు జరిగాయని, పన్నులు, గ్రాంట్లు కలిపితే 62 శాతం రాష్టాల్రకు చెల్లింపులు చేసినట్లు అరుణ్‌జైట్లీ వెల్లడించారు.మౌలిక సదుపాయాల నిధుల సేకరణకు పన్ను రహిత బాండ్లు తీసుకుంటామన్నారు.

తమ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉందని అన్నారు. రహదారులు, రైల్వే వ్యవస్థలను విస్తరించడానికి బ్జడెట్‌లో అధిక కేటాయింపులు చేశాం. తాజా బ్జడెట్‌ గ్రావిూణ మౌలిక సదుపాయాల కోసం రూ. 25వేల కోట్లను కేటాయించాం. ముఖ్యంగా రహదారులు, రైల్వే అభివృద్ధి కోసం నిధులు సేకరించేందుకు పన్ను రహిత బాండ్లును ప్రవేశపెడుతున్నాం’ అని జైట్లీ పేర్కొన్నారు..నిర్భయ నిధికి మరో వెయ్యి కోట్ల నిధి కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రక్షణ రంగానికి రూ. 2,46,727 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ తెలిపారు. మేక్‌ఇన్‌ ఇండియా పథకం ద్వారా రక్షణ పరికరాలు తయారుచేసే దేశీయ సంస్థలకు ప్రోత్సాహం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన బిహార్‌, బంగాల్‌తో పాటు ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.  ఓల్డ్‌ గోవా, హంపి, ఎలిఫెంటూ గుహలు, సారనాథ్‌, జలియన్‌వాలా బాగ్‌, కుతుబ్‌షాహీ సమాధులకు నిధులు కేటాయించారు.  ఎలక్ట్రిక్‌ వాహనాల అభివృద్ధి కోసం రూ.75 కోట్లు ఖర్చుచేస్తారు.   నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు.  వ్యవసాయరంగానికి ఊతమిస్తామన్నారు. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునే విధంగా సాగునీటి పారుదల విధానం రూపొందిస్తామని జైట్లీ తెలిపారు. 2015లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.8.5 లక్షల కోట్లు అని ఆయన వెల్లడించారు. రైతుల గిట్టుబాటు ధరల కోసం జాతీయ వ్యవసాయ మార్కెట్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బొగ్గు గనుల వేలంతో లక్షల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. లక్ష కిలోవిూటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మూడేళ్లలో ద్రవ్యలోటు 3 శాతానికి తగ్గించడమే లక్ష్యమని అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. భారతదేశానికి వచ్చే 150 దేశాలకు చెందిన వారికి వీసా ఆన్‌ ఎరైవల్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. ఈ సౌకర్యం ద్వారా అనుమతి పొందిన ఈ 150 దేశాల నుంచి ఎవరైనా సరే ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా భారత్‌కు రావచ్చు. విమానాశ్రయాల్లో వారికి వీసా అందజేస్తారు. జన్‌ధన్‌ యోజన ఖాతాదారులందరికీ డెబిట్‌ కార్డులు అందచేస్తారు.

బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు :

మౌలిక సదుపాయల ప్రాజెక్టులకు అధిక నిధులు

వ్యూహాత్మకంగా  పెట్టుబడుల ఉపసంహరణ

సబ్సిడీలకు వ్యతిరేకం కాదు…సబ్సిడీల దుర్వినియోగాన్ని అరికట్టాల్సిందే

నగదు బదిలీ పథకాన్ని మరింత విస్తరిస్తాం

అనేక సబ్సిడీలు ఇకపై నగదు బదిలీ ద్వారా అమలు

చిన్న వ్యాపారుల కోసం ముద్రా బ్యాంక్‌ ఏర్పాటు

దేశంలో 5.77కోట్ల చిన్న వ్యాపారులు…వారిలో 62శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారు

జనధన యోజన పథకం అమలు కోసం…పోస్టల్‌ లోగోను పూర్తిగా ఉపయోగిస్తాం

దేశంలో అత్యధికులకు ఎలాంటి బీమా సౌకర్యంలేదు

త్వరలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం

ఏడాదికి రూ.12 ప్రీమియంతో రూ.2లక్షల ఇన్సూరెన్స్‌

త్వరలో ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి యోజన పథకం

క్లెయిమ్‌ చేయని పీఎఫ్‌ నిధులతో సీనియర్‌ సిటిజన్స్‌ సంక్షేమానికి ప్రత్యేక పథకం

మైనారిటీ యువత కోసం నయీమంజిల్‌ పథకం

మౌలికసదుపాయాల కల్పనకు గత ఏడాదికన్నా రూ.70వేల కోట్లు అదనం

అశోకచక్ర పేరుతో గోల్డ్‌ కాయిన్లు

నిర్భయ ఫండ్‌కు అదనంగా రూ.వెయ్యి కోట్లు

25 చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం ప్రత్యేక నిధులు

రక్షణ రంగానికి రూ. 2,46,727 కోట్లు

ఉపాధి హావిూ పథకానికి అదనంగా రూ.5వేల కోట్లు

ఐసీడీఎస్‌కు రూ.1500 కోట్లు కేటాయింపు

రైళ్లు, రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టుల కోసం బాండ్లు

అటల్‌ పింఛన్‌ యోజన పథకానికి 50శాతం ప్రభుత్వ సహాయం

సూక్ష్మ సేద్యం కోసం రూ.5300 కోట్లు

సంవత్సరానికి రూ.12 ప్రీమియంతో రూ.2లక్షల ప్రమాద బీమా యోజన

బ్యాంకుల ద్వారా రైతులకు వ్యవసాయ రుణాల లక్ష్యం 8.5లక్షల కోట్లకు పెంపు

గ్రావిూణ వ్యవసాయ, మౌలిక సదుపాయాల కోసం రూ.25వేల కోట్లు.

మిగతా కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలపడింది