బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన కౌన్సిలర్ వేణు యాదవ్
హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్28(జనంసాక్షి)హుస్నా బాద్ అరెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కౌన్సిలర్ మ్యాదరబోయిన వేణు యాదవ్ ఆధ్వర్యంలో రెండవ రోజు ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.ప్రతీ రోజు ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ జాలిగం శంకర్,ఆర్పిలు స్వరూప,శారద, పద్మ,మున్సిపల్ సిబ్బంది,వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.