బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మండల అధ్యక్షులు సూరపునేని సాయికుమార్
ములుగు జిల్లా
గోవిందరావుపేట సెప్టెంబర్ 23 (జనం సాక్షి):-
గోవిందరావుపేట మండల కేంద్రంలోని జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ ల్యాడియ లక్ష్మీ జోగ్య ఆధ్వర్యంలో ప్రారంభించగా ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు సురపునేని సాయికుమార్ అతిథిగా పాల్గొని చీరలను వారితో కలిసి పంపిణి చేసారు. మండల అధ్యక్షులు సూరపనేని సాయికుమార్ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు సిరిసిల్లలోని నేత కార్మికులకు పని కల్పించేందుకు బతుకమ్మ పండుగ సారెగా మన కేసీఆర్ గారు ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తోందని అన్నారు ప్రతి సంవత్సరం రూ.300 కోట్లు బతుకమ్మ చీరల కోసం వెచ్చిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో అక్కాచెల్లెళ్లకు చీరలు పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్,ఎంపీటీసీ ఆలూరి శ్రీనివాసరావు. మండల ప్రసార కార్యదర్శి భాస్కర్ పృథ్వీరాజ్ ఉట్ల,ఉప సర్పంచ్ హనుమంతరావు గోవిందరావుపేట గ్రామ కమిటీ అధ్యక్షులు అక్కినపల్లి రమేష్, సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు,బీసీ సెల్ అధ్యక్షులు నాగచారి వార్డ్ నెంబర్ తుమ్మల శివ,కార్మిక శాఖ అధ్యక్షులు గట్టు ధర్మయ్య, రామారావు ప్రచార కార్యదర్శి మహిళలు మహిళ సంఘాలు మండల మహిళ లీడర్ లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Attachments area