బతుకమ్మ చీరల పంపిణీ చేసిన నల్లగుంట గ్రామ సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ మునిగంటి తిరుపతి రెడ్డి..
ములుగు బ్యూరో,సెప్టెంబర్23(జనం సాక్షి):-
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లోని నల్లగుంట గ్రామం లో
బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలందరికీ బతుకమ్మ చీరలను కానుకగా అందిస్తున్నారు.గ్రామ సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ
సీఎం కేసీఆర్ కి మహిళా సోదరీమణులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.మరమగ్గ నేతన్నలకు ఉపాధి కల్పించటంతోపాటు అడపడుచులకు ప్రేమపూర్వక చిరుకానుక అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.సీఎం కేసీఆర్ ప్రతి ఏడాది బతుకమ్మ చీరల కోసం 339 కోట్ల రూపాయలు వెచ్చించి,10 రంగులు 18 డిజైన్లలో 200 రకాల చీరలను ఆడబిడ్డలందరికీ బతుకమ్మ కానుకగా అందిస్తున్నారు.మన నేతన్నలు నేచిన చీరలను మన తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ కానుకగా ముఖ్యమంత్రి ఇవ్వడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.బతుకమ్మ చీరలతో నేతన్నలకు ఉపాధి కల్పన తో ఆదాయం రెట్టింపు అవుతుంది తెలియజేశారు
దేశంలో మహిళల కోసం అత్యధికంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే
నల్లగుంట గ్రామ ప్రజలకు అడ్వాన్స్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో ములుగు వైస్ ఎంపీపీ మునిగంటీ తిరుపతి రెడ్డి,ఉప సర్పంచ్ భూక్యా శంకర్,గ్రామ గుడి కమిటీ చైర్మన్ మందల మధుకర్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,పులి మధుసూదన్ రెడ్డి,డీలర్ వెంకట స్వామి, రాజుకుమార్ లతో పాటు లబ్దిదారులు పాల్గొన్నారు.
Attachments area