బతుకమ్మ చీరల పంపిణీ.

బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న సర్పంచ్.
నెన్నెల, సెప్టెంబర్25,(జనంసాక్షి)
నెన్నెల మండలం గొల్లపల్లి, ఆవడం,కోణంపేట, మన్నెగూడెం గ్రామాల్లో ఆదివారం స్థానిక సర్పంచులు మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ పండగ అయిన బతుకమ్మ, దసరా పండగకు ఆడపడుచులందరు నూతన వస్త్రాలు ధరించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు చీరల పంపిణీ చేస్తున్నారని వారు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆవడం లో ఎంపీపీ సంతోషం రమాదేవి, గొల్లపల్లిలో సర్పంచ్ ఇందూరి శశికళ, ఉప సర్పంచ్ జాడి నారాయణ, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఇందూరి రమేష్, కోణంపేట సర్పంచ్ కంకణాల తిరుపతి రెడ్డి, మన్నెగూడెం సర్పంచ్ గొర్లపల్లి బాపు తదితరులు పాల్గొన్నారు.