బతుకమ్మ పోస్టర్‌ ఆవిష్కరించిన ‘పొత్తూరి’

హైదరాబాద్‌,అక్టోబర్‌  9 (జనంసాక్షి) :  తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహి స్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం నేటికీ నిధులే ఇవ్వలేదని మాజీ ఎడిటర్‌ పొత్తూరి వెంకటేశ్వర రావు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో మంగళవారం ఉదయం బతుకమ్మ జాతర పోస్టర్‌ను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా పొత్తూరి మాట్లాడుతూ బతుకమ్మ పండు గను ఈ నెల 15 నుంచి 23 వరకు తెలంగాణ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిం చనున్నట్టు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించే షెడ్యూలును   ఖరారు చేశామని, ఆ షెడ్యూలు ప్రకారమే తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని కవిత వివరించారు. 15న మణుగూరు, 16న భూపాలపల్లి, 17న శ్రీరాంపూర్‌, 18న ధర్మపురిలలో నిర్వహించనున్నట్టు చెప్పారు. అలాగే ఈ నెల 19న దుబ్బాక, 20న బోధన్‌, 21న సంస్థాన్‌ నారాయణపూర్‌, 22న కొల్లాపూర్‌, 23న హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నిర్వహించనున్నట్టు తెలిపారు.