బతుకు “పూతోట”….
కాలం కలిసి రాలేదనో..
కష్టాలు చుట్టు ముట్ఠాయనో
కన్నీటి సంద్రంలో కొట్టుకుపోతే ఎలా?
కల నిజం కాలేదనో…
లక్ష్యం నెరవేరలేదనో…
నిరాశ నిస్పృహల్లో కృంగి కృషిస్తే ఎలా?
గౌరవం దక్కలేదనో…
గెలుపు “దరి” చేరలేదనో…
నిట్టనిలువుగా చీలిపోతే ఎలా?
నమ్మినోళ్లు వంచించారనో…
అయినోళ్ళు దూరం చేశారనో…
పొగిలి పొగిలి దుఃఖిస్తే ఎలా?
ఇక్కట్ల “చీకట్లు” ముసిరాయయనో…
బతుకు దారులు మూసుకున్నాయనో..
తనువు చాలిస్తానంటే ఎలా?
మిత్రమా!
స్పందనంటూ లేకుంటే…
చేతనమంటూ రాకుంటే….
బండ రాయికి నీకు బేధం ఎక్కడిది
గత జ్ఞాపకాల నెమరు వేస్తూ
ఉన్నచోటనే “గిరి” గీసుకు కూర్చుంటే…
సుప్తావస్థ “జీవి”కి నీకు తేడా ఎక్కడిది
జీవన క్షణాల నిర్వీర్యం చేస్తూ
చాదస్తపు “చలి” మంటల కాస్తుంటే…
అల్పునికి నీకు “అంతరం” ఎక్కడిది?
ముందుగా
అజ్ఞానాన్ని త్యజించి
వికాస “జ్యోతి”ని వెలిగించు
నిస్తేజాన్ని తిరస్కరించి
చైతన్య “జ్వాల” రగిలించు
భయాన్ని బహిష్కరించి
బతుకు “పోరు”కు సిద్ధపడు
తొలుత….
అడ్డంకుల “పల్లేర్లు” పరిహసించొచ్చు గాక!
కడకు….
బతుకు “పూతోటై “పరిమళిస్తుంది
“”””””””””””””””
కోడిగూటి తిరుపతి
(జాతీయ ఉత్తమ కవి పురస్కార గ్రహీత)
Mbl no:9573929493