బధిరుల పాఠశాలకు లెర్నింగ్ కిట్స్ అందజేత
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): వాసవి క్లబ్,సూర్యాపేట ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ మీలా వాసుదేవ్ తెలిపారు.శుక్రవారం
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు పాత సుదర్శన్ ఆదేశాల మేరకు విద్యా వికాస్ కార్యక్రమంలో భాగంగా వాసవి క్లబ్ అధ్యక్షులు మీలా వాసుదేవ్, సుధాకర్ విజన్ క్లబ్ ప్రెసిడెంట్ అనంతుల శారద , ట్రెజరర్ డి.సంధ్య ఆధ్వర్యంలో కాసరాబాద్ లోని అపూర్వ బధిరుల, మానసిక వికలాంగుల పాఠశాలకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ రెండు కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పాఠశాల్లో నోట్ బుక్స్ పంపిణీ చేసినట్లు చెప్పారు.పది మంది బాలికలకు సైకిళ్లను అందజేసినట్లుచెప్పారు.కరోనా సమయంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందజేసినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ తోట శ్యాం ప్రసాద్ , రీజనల్ చైర్మన్ బిక్కుమళ్ల కృష్ణ , జెడ్సీలు మీలా వీరమణి, కలకోట లక్ష్మయ్య, వనితా సిల్వర్ స్టార్ క్లబ్ అధ్యక్షురాలు బిక్కుమళ్ల లక్ష్మి , పాఠశాల కరస్పాండెంట్ మదనచారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.