“బబ్లీ బౌన్సర్” స్క్రిప్ట్ నాకు దక్కటం నా అదృష్టం..పాన్ ఇండియా హీరోయిన్ తమన్నా
సెప్టెంబర్ 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో బబ్లీ బౌన్సర్” గ్రాండ్ రిలీజ్
ప్రముఖ యూత్ ఐకాన్ & పాన్ ఇండియా నటి తమన్నా లేడీ బౌన్సర్‌గా నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫిలిం “బబ్లీ బౌన్సర్”. మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో తమన్నా భాటియాను చూపిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్ మరియు జంగిలీ పిక్చర్స్ నిర్మించాయి .ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది..అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా
చిత్ర దర్శకుడు మధుర్ భండార్కర్ మాట్లాడుతూ. హైదరాబాద్ తో నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి..నా మొదటి సినిమా “చాందినిబార్” హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో తియ్యడం జరిగింది.రాము గారితో కలసి రాత్రి, రంగీలా, గాయం, అంతం ,గోవిందా గోవిందా మొదలగు సినిమాలకు వర్క్ చేశాను.మళ్ళీ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు రావడం చాలా సంతోషంగా ఉంది..ఈ సినిమా విషయానికి వస్తే నార్త్ సైడ్ లో లేడీ బౌన్సర్ లను చూశాను. ఇక్కడ సౌత్ లో ఉండకపోవచ్చు. వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ సినిమా మెదలుపెట్టాను.ఈ సినిమాలో హీరోయిన్ బబ్లీ గా ఫిజికల్ గా, మెంటల్ గా మెచ్యూరిటీ చూపించాలి. ఈ విషయంలో తమన్నా ది బెస్ట్ అనిపించింది. “బాహుబలి” లో తమన్నా చేసిన రోల్ ఆమె లోని నటిని బయటకు తీసుకువచ్చింది అనుకుంటాను. ఈ సినిమాకు తమన్నాను ఎందుకు తీసుకున్నావ్ అని ఆడిగారు. ఆలా అడిగిన వారందరూ ఈ ట్రైలర్ చూసిన తరువాత ఫోన్స్ చేసి మీ ఛాయిస్ 100% కరెక్ట్ అని చెప్పారు. మేము అనుకున్నట్టే ఈ సినిమాలో తమన్నా బౌన్సర్ గా చాలా చక్కగా నటించింది. ఈ నెల 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల అవుతున్న ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుంది అన్నారు.
నటి తమన్నా మాట్లాడుతూ.. తెలుగు సినిమా అంటే నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా జర్నీ తెలుగు నుండే సార్ట్ ఆయ్యింది. రాజమౌళి, సుకుమార్ లు అందరూ మన ఇండియన్ రూట్స్ కథలు తీసుకొని చేస్తుంటారు. ఇప్పటికీ మన ఇండియన్ సినిమాను మన ఏమోషన్సే నడిపిస్తాయి తొలి సారిగా లేడీ బౌన్సర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ స్క్రిప్ట్ నాకు దొరకడం నా అదృష్టం. .పలు సార్లు జాతీయు అవార్డ్స్ పొందిన మధుర్ భండార్కర్ సర్ తో చేసే అవకాశం వచ్చిందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాలో హరియాణాకు చెందిన యువతిగా నటించాను.తప్పకుండా ఈ సినిమా నా కేరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. మధుర్ బండార్కర్ సినిమాలో నటించిన హీరోయిన్స్ కు జాతీయ అవార్డ్స్ వస్తాయి. నాకు కూడా ఈ చిత్రానికి అవార్డ్స్ రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ నెల 23న డిస్నీ+ హాట్‌స్టార్ లో విడుదల అవుతున్న ఈ సినిమా ను కుటుంబ సమేతం గా ఇంట్లో కూర్చొని హ్యాపీ గా చూడండి అన్నారు.