బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు శిక్షణ

 

* ఎస్సై రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) :

ఆగస్టు 7న జరగనున్న ఎస్సై అభ్యర్థుల ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించిన బయోమెట్రిక్ ఇన్విజిరేటర్లకు పరికరాలపై శిక్షణ కార్యక్రమం శుక్రవారం నాడు పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో జరిగింది.
బయోమెట్రిక్ పరికరాలపై శిక్షణ పొంది ఉన్న పోలీసు అధికారులు ఈ బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇచ్చారు. ఎస్సై అభ్యర్థుల రాతపరీక్ష కోసం 6 కళాశాలల్లో 21 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 11,854 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించడం జరగదు. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పకుండా హాల్ టికెట్ ను వెంట తీసుకొని రావాలి.
పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్సై అభ్యర్థుల రాత పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ఈ పరీక్ష కొనసాగుతుందని చెప్పారు. పరీక్ష నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవకతవకులకు ఆస్కారం లేకుండా పగడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. నిష్పక్షపాతంగా రాత పరీక్ష కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (పరిపాలన) జి చంద్రమోహన్ రీజినల్ కో-ఆర్డినేటర్-1, టి శ్రీదేవి, చీఫ్ సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.