బయ్యారం మండలం బాలాజీ పేటలో మత్స్య పారిశ్రామిక సంక్షేమ సంఘం ఎన్నికను రద్దు చేయాలని మత్స్యకారులు ఆందోళన

బయ్యారం మండలం బాలాజీపేట లో మంగళవారం జరిగిన మత్స్యకారుల సహకారుల సంఘం పారిశ్రామిక ఎన్నిక పూర్తిగా మోసపూరిత ఎన్నికేనని బయ్యారం మండలం బాలాజీపేటకు చెందిన మత్స్యకారులు ఆరోపించారు.ఈ సందర్భంగా మత్సకారులు మాట్లాడుతూ… మంగళవారం జరిగిన మత్స్య పారిశ్రామిక సంఘం ఎన్నికకు సంబంధించి బయ్యారం మండలం మత్స్యకారులు ఈనెల 13న బాలాజీ పేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో మత్స్య పారిశ్రామిక సంక్షేమ సంఘం, కొత్త రాందాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి, సుమారు 85  మంది మెజారిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసినప్పటికీ,ఆ తీర్మానాన్ని రద్దుచేసి లోపాయకారిగా  మత్స్యశాఖ ఎన్నికల అధికారి, కొందరు రాజకీయ నాయకులకు అండగా ఉండేందుకు వారికి అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే అధ్యక్షులుగా ఎన్నుకున్నారని,తక్షణమే ఆ బూటకపు ఎన్నికను రద్దు చేసి, తీర్మానం చేసిన దాని ప్రకారమే తిరిగి మళ్లీ ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 

తాజావార్తలు