బరువు తగ్గేందుకు శస్త్రచికిత్స చేయించుకుంటూ వ్యక్తి మృతి
హైదరాబాద్: బరువు తగ్గేందుకు చేసిన శస్త్రచికిత్స వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా ఉప్పల్ రవాణాశాఖ అధికారిగా పనిచేస్తున్న రాజేంద్రకుమార్ అధిక బరువు సమస్యతో ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో చేరారు. బరువు తగ్గేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేస్తుండగా అతను మృతి చెందాడు.