బలోపేతం చేసేందుకే మంత్రి పదవులు: వీహెచ్
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య కొన్ని జిల్లాల్లో సమన్వయం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకే ఐదుగురు ఎంపీలకు కేంద్ర మంత్రులుగా అధిష్ఠానం అవకాశం ఇచ్చిందని అన్నారు. పార్టీలు మారే వారికి అధిక ప్రాధాన్యం ఇస్తే జెంగా మోసిన వారి పరిస్థతి ఏమిటని ఈ సందర్భంగా ప్రశ్నించారు.