బస్టాండ్ వైపు మల్లని ఆర్టీసీ బస్సు,ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

 బషీరాబాద్ అక్టోబర్ 16,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు కోసం,ప్రయాణికుల కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వం కట్టించిన బస్టాండ్ వైపు తాండూర్ నుండి బషీరాబాద్ లోకల్ బస్సు బస్ స్టాండ్ వైపు వెళ్లకుండా నవాంద్గి రైల్వే స్టేషన్  దగ్గరనే మళ్లీ తాండూర్ కు తిరుగు ప్రయాణం చేస్తున్న ఆర్టీసీ బస్సు. బస్సు డ్రైవర్ పై ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రోజున ఆర్టీసీ బస్సు మధ్యాహ్న పూట సమయంలో బషీరాబాద్ లోకల్ బస్సు నవాంధ్గి రైల్వే స్టేషన్ నుండి తాండూరుకు వెళ్లడం జరుగుతుంది. ఇలా వెళ్లడం వలన ప్రయాణినికులం ఎంతో ఇబ్బందులు పడుతున్నమని తెలిపారు. అయిన కూడా ఆర్టిసి వాళ్లు పట్టించుకోరా అన్ని ఆరా తీశారు.బస్టాండ్ నుండి రైల్వే స్టేషన్ వరకు రావాలంటే ఆటోలో లేదా నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. ఆటోలో వస్తే ఆటో వాళ్ళు వంద రూపాయలు కిరాయి తీసుకుంటారు. ఆర్టీసీ బస్సు బస్టాండ్ వరకు వస్తే మాకు ఈ తిప్పలు తగ్గుతాయని, బస్టాండ్ దగ్గర విశాలమైన మైదానం సి.సి రోడ్డు ఉన్నా కూడా ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఇరుకులో మళ్లీ   తాండూరు కు తిరుగు ప్రయాణం చేపడుతున్న ఆర్టీసీ డ్రైవర్,గతంలో కూడా ఆర్టీసీ డ్రైవర్ ఈ నావంద్గి రైల్వే స్టేషన్ దగ్గర ఆర్టీసీ బస్సు మలు తుండగా ఆర్టీసీ బస్సు రైల్వే స్టేషన్ కాంపౌండ్ గేటుకు తలగడంతో గోడ కూలడం జరిగింది.ఆర్టీసీ వారు మరమ్మతులు చేయించడం కూడా జరిగింది. అది తెలిసి కూడా ఆర్టీసీ డ్రైవర్ మళ్లీ అదే స్థానంలో బస్సును మలపడం ఎంత వరకు కరెక్ట్ అన్ని ప్రయాణికులు అంటున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ డిపో వాలు ఈ విషయనీ గమనించి వెంటనే బషీరాబాద్ లోకల్ బస్సు బస్టాండు వరకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరారు.
Attachments area