బస్తీ దావఖాన ఏర్పాటుకు సన్నాహక చర్యలు.

బస్తి దావఖానలతో పేద ప్రజలకు మంచి నాణ్యమైన ఉచిత వైద్యం అందుతోందని మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ రాజు అన్నారు.బుధవారం నేరేడ్ మెట్ డివిజన్ రేణుక నగర్ లో బస్తీ దవాఖాన ఏర్పాటుకు రేణుక నగర్ కమ్యూనిటీ హాల్ ను టిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఉపాధ్యక్షులు ఉపేందర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.పేద ప్రజలకు ఇంటి వద్దనే వైద్య సహాయం అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బస్తి దావఖానలను ఏర్పాటు చేసిందని ఇందులో భాగంగా సైనిక్ విహార్,రేణుక నగర్,శివసాయినగర్, సాయి నగర్ ప్రాంతాలలో నివాసం ఉంటున్న నిరుపేదలకు అందుబాటులో ఉండే విధంగా రేణుక నగర్ కమ్యూనిటీ హాల్ లో బస్తీ దవాఖానను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.టిఆర్ఎస్ నాయకులు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు,బ్రతుకుదెరువు కొరకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి బస్తీలలో నివాసం ఉంటున్నారని వారికి చేరువలోనే బస్తి దావఖానలను ఏర్పాటు చేసి మెరుగైన ఉచిత వైద్యం అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని,బస్తీ దవాఖానలో డాక్టర్,నర్సు తో పాటు సపోర్టింగ్ స్టాప్ అందుబాటులో ఉంటారని నిరుపేదలు బస్తీ దవాఖాన లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈకార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్ స్పెక్టర్ నాగరాజు,టిఆర్ఎస్ నాయకులు మహేష్,రాజు,తదితరులు పాల్గొన్నారు.