బస్సును ఢీకొన్న లారీ… డ్రైవరు మృతి
ఖమ్మం, : వేగంగా వస్తున్న ఓ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొన్న సంఘటనలో బస్సు డ్రైవరు మరణించిన సంఘటన ఖమ్మం జిల్లాలో బుధవారం జరిగింది. కుంట నుంచి ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌కు వెళుతుండగా తల్లాడ మండలం మంగాపురం వద్ద వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవరు పాషా మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.