బస్సు బోల్తా : 45 మంది అయ్యప్ప భక్తులకు గాయాలు

బిచ్కుంద : నిజామాబాద్‌ జిల్లా కందర్‌పల్లి వద్ద గురువారం తెల్లవారుజామున అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న ఓ బస్సు బోల్తాపడింది. ఈ ప్రయాణంలో 45 మంది అయ్యప్పభక్తులు గాయపడ్డారు. బాధితులను చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం సీతారాంపేట వాసులుగా గుర్తించారు. వీరు షిర్డీ నుంచి శబరిమల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.