*బస్సు రూటు పొడగించాలని వనపర్తి ఆర్టీసీ డి ఎం గారికి వినతి*
శ్రీరంగాపురం: సెప్టెంబర్ 01 (జనంసాక్షి):
శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని పునరావస గ్రామమైన నాగరాల సెంటర్ 3 నగరాల సెంటర్ టు కంబలాపూర్ తాండ కంబాలాపూర్ మీదుగా పెబ్బేరు దాకా బుసిరెడ్డి పల్లె వెళ్లి వనపర్తి వచ్చే బస్సును పెబ్బేరు వెళ్లే వచ్చే విధంగా పొడిగించాలని వనపర్తి ఆర్టీసీ డిఎం గారిని విజ్ఞాపన చేయడం జరిగింది. దాదాపు 2014 నుండి కొత్త గ్రామాలలో ఇల్లు కట్టుకొని ఉన్న ప్రజలు విద్య వైద్యం మరియు నిత్యావసర సరుకులకు దూరంగా రవాణా లేకపోవడం వల్ల జీవనం కొనసాగిస్తున్నారని దానివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కనీసం రేషన్ సరుకులు కూడా తెచ్చుకోవడానికి ఇబ్బంది ఉందని ఆర్టీసీ అధికారుల దృష్టికి తెచ్చి సమస్యను విన్నవించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నాతో పాటుగా శ్రీధర్ శివ నారాయణ అంజనేయులు వెంకటరామిరెడ్డి తిరుపతిరెడ్డి నరసింహ తదితరులు పాల్గొనడం జరిగింది.