బహుజన నిర్మాణ్ సమితి పార్టీని స్వాగతిస్తున్నాం.

బహుజన రాజ్యాధికార యాత్రకు సంపూర్ణ మద్దతు.
బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 21(జనంసాక్షి):
బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ఏర్పడి న బహుజన నిర్మాణ్ సమితి పార్టీని స్వాగ తిస్తున్నామని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి అన్నారు.బహుజన నిర్మాణ్ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ బుధవారం రాజాపూర్ మండల కేంద్రంలో ప్రైవేట్ కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా అరవింద్ చారి మాట్లాడుతూ అక్టోబర్ 1న బహుజన రాజ్యాధికార యాత్ర నిర్వహించ బడుతుందని తెలిపారు. గతంలో బీసీ సంఘం నాయకులు జాతీయ స్థాయి వరకు ఎదిగి పార్టీలు పెడతామని అన్నారే తప్ప ధైర్యం చేసి ముందుకు వచ్చి ఏ ఒక్క నాయకుడు పార్టీ పెట్టలేకపోయార ని అన్నారు.జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో బీసీలు లేకపోవడం దురదృష్టం గా భావించి తరాలు మారిన అదే వెనుక బాటుతనం ఉందని గ్రహించిన శ్రీనివాస్ యాదవ్ బీసీ లను రాజకీయ చైతన్యం చేయాలని,బహుజన రాజ్యం సాదించాలని ధైర్యంతో నూతన పార్టీని స్థాపించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.బీసీ కులాలు విద్యా, ఉద్యోగ,ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందుండాలని అన్నారు.దీనికి గాని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బహుజన కుల సంఘాల నాయకులు మరియు ఇతర పార్టీలలో పని చేస్తున్న టువంటి మంత్రులందరూ ఏకమై పార్టీని బలోపేతం చేసేవిధంగా ప్రయత్నం చేయాల ని విజ్ఞప్తి చేశారు.అన్ని రంగాలలో మేమెం తో మాకు అంత వాటా కావాలంటూ చేపట్టనున్న బహుజన రాజ్యాధికార యాత్రలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బిసి పొలిటికల్ జేఏసీ నాయకులు జంగయ్య, రాజు, నాగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.