*బాధితురాలికి ఆర్థికసాయం అందించిన మదన్మోహన్
15 జూలై (జనంసాక్షి)లింగంపేట్ మండలంలోని మోతె గ్రామానికి చెందిన గౌసియా బేగంకు శుక్రవారం టి పిసిసి ఐటీ సెల్ చైర్మన్ మదన్మోహన్ రావ్ ఆర్థికసాయం అందజేసినట్లు లింగంపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నల్లమడుగు షరీఫ్ తెలిపారు.మొన్న కురిసిన వర్షాలకు గౌసియబేగం నివాసపు గుడిసె కూలిపోయిన విషయం తెలుసుకొని మోతె గ్రామానికి వచ్చి ఆమెకు ఆర్థికసాయం అందజేసి ధైర్యం చెప్పారు.వీరి వెంట కాంగ్రెస్ నాయకులు రాజేశ్వర్ రెడ్డి తూర్పు రాజులు నాయకులు సిద్దు మెహరాజ్ గోవింద్ శ్రీనివాస్ గౌడ్ ఏలేటి రాజిరెడ్డి గ్రామకాంగ్రెస్ కార్యకర్తలున్నారు.



