బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జెడ్పీటీసీ
శివ్వంపేట సెప్టెంబర్ 26 జనంసాక్షి :
మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామానికి చెందిన పెద్దకోళ్ల వీరాస్వామి కొడుకు పెద్దకోళ్ల నరేష్ ఇటీవలే మరణించారు. పార్టీ శ్రేణుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఆర్థిక ప్రణాళికా సంఘం సభ్యులు, శివ్వంపేట జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వీరాస్వామి కుటుంబానికి తనవంతు సహకారం గా 5 వేల రూపాయల ఆర్థిక సహాయం తోపాటుగా నిత్యావసర సరుకులను కూడా అందించి నేనున్నాననే మనోస్థైర్యం కల్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మహేష్ గుప్త మాట్లాడుతూ వీరాస్వామి చిన్న కొడుకు ప్రమాదవశాత్తూ చెరువులో పడి మరణించడని ఇప్పుడు, ఇంకో కొడుకు కూడా మరణించడం ఎంతో బాధాకరమైన దుఃఖకర విషయం అన్నారు. బాధిత కుటుంబానికి మరింత సహకారం తప్పకుండా అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. వీరాస్వామి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జెడ్పీటీసీ మహేష్ గుప్తకు బాధిత కుటుంబం తరుపున దళిత సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివ్వంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ పద్మ వెంకటేశ్, రెడ్యతాండా సర్పంచ్ రంగీలా ఆంజనేయులు,మాజీ మండల పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ,వార్డు సభ్యులు బాసంపల్లి పోచగౌడ్, ముయ్యడి జ్యోతి సింహం, పంబల్ల సంతోష్,కుంట రాజు, పంచాయతీ కారోబార్ వంజరి గౌరీశంకర్, దళిత సంఘం నాయకులు చింతకింది బిక్షపతి, ఎర్ర పోచయ్య, కుంట లింగం, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.