బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత
పానుగల్ అక్టోబర్ 23 జనంసాక్షి
గత కొన్ని రోజుల క్రితం ట్రైన్ ఆక్సిడెంట్ లో చనిపోయిన మాందాపూర్ గ్రామానికి చెందిన పాండు కుటుంబానికి రాష్ట్ర సగర సంఘము తరపున వనపర్తి జిల్లా అధ్యక్షులు మోడల తిరుపతయ్య ఆధ్వర్యంలో లక్ష రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అందజేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు పెద్దభూది మహేశ్వరి,
రాష్ట్ర జాయింట్ సెక్రటరీ విష్ణు, రాష్ట్ర మహిళా కమిటీ లీగల్ అడ్వైజర్ సృజన, ప్రధాన కార్యదర్శి పల్లె సత్యనారాయణ ,ఉపాధ్యక్షులు స్వామి,పట్టణ అధ్యక్షులు పెద్దనాగుల, ప్రధాన కార్యదర్శి జనార్దన్, పట్టణ యూత్ అధ్యక్షులు మహేష్, మరియు మండలాధ్యక్షులు కృష్ణయ్య మరియు సగర కుల సభ్యులు పాల్గొన్నారు.