బాధిత కుటుంబాలకు అండగా ఉంటా…
– మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి.
ఊరుకొండ, ఆగస్టు 8 (జనం సాక్షి):
ఊర్కొండ మండలంలో ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని మాదారం సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ధ్యాప నిఖిల్ రెడ్డి అన్నారు. మండలంలోని ఇప్పపహాడు గ్రామానికి చెందిన దువ్వాసి బక్కయ్య(50) ఆదివారం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. ఈ సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, డి.ఎన్.ఆర్ యువసేన సభ్యులు ద్వారా సమాచారం తెలుసుకుని బాధిత కుటుంబానికి ఐదు వేల రూపాయల నగదును సమకూర్చారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీ ఎన్ ఆర్ సభ్యులు బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిరుపేదలకు అండగా ఉంటూ, వారి బాధలను తన బాధలుగా అభివర్ణించుకుంటూ వారికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించడమే తన లక్ష్యమని అన్నారు. తనకు ఉన్న దాంట్లో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడమే తన గమ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో బాలస్వామి, మల్లేష్, నాగరాజు, హరికృష్ణ, శ్రీశైలం, చందు, యాదయ్య, బలరాం, అర్జున్, శివ, తదితరులు పాల్గొన్నారు.