బాధిత కుటుంబాలకు మంత్రి వేముల పరామర్శ

జులై 16( జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా
బాల్కొండ మండలం లోని వన్నెల్ (బి) గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మంత్రి అత్యంత ఆత్మీయులు వన్నెల్ బి గ్రామ మాజీ సర్పంచి తాళ్ళ భూషణ్ ఇటీవల గుండేపోటుతో ఆకస్మిక మరణం చెందడంతో వారి కుటుంబాన్ని శనివారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.అదే గ్రామానికి చెందిన తాళ్ళ లక్ష్మీనారాయణ కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో ఆకస్మిక మరణించడంతో వారి
 కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.వారి ఆకస్మిక మరణం చాలా బాధాకరమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామానికి చెందిన వెల్మ దేవన్న అనారోగ్యంతో ఉండగా ఆయన ఇంటికి పరామర్శించారు.కూలిన ఇళ్లను పరిశీలించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
వరసగా కురిసిన భారీ వర్షాలకు వన్నెల్ బి గ్రామానికి చెందిన కర్ణం సాగర్ ఇల్లు కూలిపోవడంతో శనివారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించి అధికారులను అడిగి వివరాలను తెలుసుకొని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్,జడ్పీటీసీ సభ్యులు దాసరి లావణ్య-వెంకటేష్,వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్,వన్నెల్ బి సర్పంచి నాగులపల్లి భూదేవి-కిషన్,ఎంపీటీసీ గంగసారం బోజరెడ్డి,రైతు బంధు మండల కో ఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తౌటు గంగాధర్,తెరాస మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,ఉపసర్పంచిలు, తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు కోటగిరి శ్రీకాంత్ చారి,వన్నెల్ బి గ్రామ రైతు కో ఆర్డినేటర్ పన్నాల గంగారెడ్డి,తెరాస నాయకులు బక్కురి భూమేశ్వర్,కంచు దేవేందర్,మగ్గిడి రాయధాసు, రత్నాపురం రాజా గంగారాం, రాజా నర్సయ్య తదితరులు పాల్గొన్నారు
Attachments area