బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

జనం సాక్షి, చెన్నరావు పేట

మండల కేంద్రానికి చెందిన వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన సుగుణ,బండి ఉపేందర్,రజిత తదితర బాధితులకు సీఎంఅర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అదేశాల మేరకు నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ చెన్నారావుపేట మండల కన్వీనర్ కంది కృష్ణ రెడ్డి జిల్లా కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ రఫీ,సర్పంచ్ కుండే మల్లయ్య ల చేతుల మీదుగా బా కుటుంబాలకు అందజేశారు అలాగే మండలం లోని జోజిపేట నారాయణ తండ గ్రామంలోని సీసీ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసిన సర్పంచ్ విజయ బలజోజి,మాజీ జడ్పీటిసి జున్నుతుల రాంరెడ్డిలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు గుండాల మహేందర్ ,దారవత్ శ్రీను,వార్డు సభ్యులు జున్నుతుల శ్రీధర్ రెడ్డి బండి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు