*బాధిత కుటుంబాలను ఆదుకుంటాం* *ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి*
మద్దూర్ (జనంసాక్షి): నారాయణపేట జిల్లా మద్దూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన తల్లి బిడ్డలు మృతి చెందిన కృష్ణవేణి కుటుంబ సభ్యులను
ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమర్శించారు. అనంతరం బావాజీ దేవాలయ పూజారి రాములు నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.స్థానిక ఆశా కార్యకర్త బలవంతంగా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లడంతోనే బాలింత మృతి చెందినట్లు మృతురాలి బంధువులు ఎమ్మెల్యే కు పిర్యాదు చేసారు. బాద్యులపై చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాలమూరు విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ లక్ష్మి కాంత్ రాథోడ్, పార్టీ నాయకులు బాల్ సింగ్ నాయక్,మండల తెరాసా అధ్యక్షుడు సి వెంకటయ్య, మీరాన్, నరేందర్, మల్లేష్, హన్మి రెడ్డి, వెంకట్ రాములు, జనార్ధన్, ఎకె రాజు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.