బాధ్యతలు చేపట్టిన జైపాల్‌రెడ్డి
ఢిల్లీ: కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖామంత్రిగా జైపాల్‌రెడ్డి ఈ రోజు సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఈశాఖ కేటాయించినందుకు ప్రధానికి ధన్యవాదులు తెలియజేశారు. 8వేల మంది శాస్త్ర వేత్తలతో పనిచేసే అవకాశం దక్కిందన్నారు. 12వ పంచవర్ష ప్రణాళికలో శాస్త్ర, సాంకేతిక రంగానికి పెద్ద పీట వేశామన్నారు. శాస్త్ర, సాంకేతికరంగంలో భారత్ పనితీరు సంతృప్తికరంగా ఉందని జైపాల్‌రెడ్డి వెల్లడించారు.