బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి.
చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.
మాజీ జడ్పీటీసీ,బిజెపి నాయకురాలు కొండ మనెమ్మ నాగేష్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై30(జనంసాక్షి):
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ లో జరిగిన ప్రమాదంపై నాగర్ కర్నూల్ మాజీ జడ్పీటీసీ,బిజెపి నాయకురాలు కొండ మనెమ్మ నాగేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆమె మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రేగుమాన్ గడ్డ దగ్గర జరుగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు కూలీలు, క్రేన్ సాయంతో పంప్ హౌస్ లోకి దిగుతుండగా వైర్ తెగిపోవడం తో జరిగిన ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలను రాత్రికి రాత్రే హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించడంలో అనుమానాలు వ్యక్త మవుతున్నాయని అన్నారు.నాగర్ కర్నూల్ జల్లా కేంద్రంలో జిల్లా వైద్య కేంద్రం ఉండగా చనిపోయిన మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించడం ఏంటని ప్రశ్నించారు.

ఈ ఘటనకు బాధ్యులలైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని,చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కొండ మనెమ్మ డిమాండ్ చేశారు. మరోవైపు జూన్ 10వ తేదీన పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నేషనల్ లేబర్ కమిషన్ చైర్మన్ పపరిశీలించారని, నిర్మాణ పనుల్లో రక్షణ చర్యలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారని,భద్రతా లోపాలపై ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారని తెలిపారు.అయినా కాంట్రాక్టు ఏజెన్సీ,అధికారులు పట్టించుకోక పోవడంతోనే ఇవాళ ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఇది ముమ్మాటికీ ప్రభుత్వ మరియు మంత్రి నిరంజన్ రెడ్డి నిర్లక్షమేనని ఈ ప్రమాదానికి వారు కూడా బాధ్యులని అన్నారు.మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు